రాహుల్ పట్టాభిషేకం పక్కా ప్రణాళిక - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ పట్టాభిషేకం పక్కా ప్రణాళిక

November 20, 2017

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా యువరాజు రాహుల్‌ గాంధీకి పట్టాభిషేకం చేయడానికి మూహూర్తం ఖాయమైంది. డిసెంబర్ నెలలో ఆయన తన తల్లి సోనియా గాంధీ నుంచి పగ్గాలు చేపట్టనున్నారు. తద్వారా గుజరాత్‌ ఎన్నికలకు ముందుగానే పట్టాభిషిక్తుడై పార్టీని పరుగులు పెట్టించనున్నారు. సోమవారం కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 16న పార్టీ అధ్యక్షపదవికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించింది. ఎన్నికకు డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ వదులుతారు. 16న ఓటింగ్‌ నిర్వహించి, 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోటీ లేకపోతే రాహులే పదవి చేపడతారు. ఎవరూ పోటీ చేయడానికి ముందుకురాని పరిస్థితిలో ఆయనకు పదవి ఖాయమైనట్టే. వరస ఓటములతో కుదేలైన పార్టీకి రాహుల్ జవసత్వాలు అందిస్తారని భావిస్తున్నారు.