ప్రియాంకా చోప్రా జిందాబాద్.. కాంగ్రెస్ నేత సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకా చోప్రా జిందాబాద్.. కాంగ్రెస్ నేత సంచలనం

December 2, 2019

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన సభ వైరల్‌గా మారింది. ఈ సమావేశంలో ఓ నేత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ప్రియాంకా గాంధీకి బదులు ప్రియాంకా చోప్రా జిందాబాద్  అని చెప్పారు. తప్పు గ్రహించిన నిర్వాహకులు వెంటనే క్షమాపన చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రియాంకా చోప్రా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

ఢిల్లీకి చెందిన  కాంగ్రెస్ నేత సురేంద్ర కుమార్ ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. దీనికి ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ చోప్రా హాజరయ్యారు. ఆ సమయంలో నేతల ప్రసంగం తర్వాత సురేంద్ర కుమార్ తమ పార్టీ పెద్దలకు కార్యకర్తలతో జేజేలు కొట్టించారు. ముందుగా సోనియా గాంధీ..అనగానే, కార్యకర్తలు జిందాబాద్ అన్నారు. తర్వాత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పారు. ఆ వెంటనే ప్రియాంకా గాంధీకి బదులు నోరు జారి ప్రియాంక చోప్రా అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు జిందాబాద్ అని చెప్పారు. ఆయన పక్కనే ఉన్న మరో నేతల కల్పించుకొని క్షమాపన చెప్పారు.