Congress Resumes Telangana Leg of Bharat Jodo Yatra After 4-day Diwali Break
mictv telugu

తెలంగాణలో తిరిగి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

October 27, 2022

మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర మళ్లీ మొదలైంది. రెండో రోజులో భాగంగా మక్తల్‌ సమీపంలోని 11/22 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటల సమయంలో పాదయాత్ర మొదలైంది. యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉదయం యాత్ర ప్రారంభమైన తరువాత మక్తల్ ట్యాంక్బండ్ వద్ద బీడీకార్మికులు, కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక సంఘం నేతలను రాహుల్ గాంధీ కలుసుకున్నారు. మక్తల్‌ పెద్దచెరువు వద్ద మత్స్యకారులు రాహల్‌ను కలిసి.. తాము ఆర్థిక, విద్యారంగాల్లో వెనుకబడ్డామని వివరించారు. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మధ్యాహ్నం బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ అనంతరం రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ నిర్వహించనున్నారు. ఆ సమయంలో రైతు సమస్యలపై రాహుల్‌ మాట్లాడతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి యాత్ర మళ్లీ మొదలవుతుంది. రాత్రికి గుడిగండ్ల వద్ద ముగుస్తుంది. గుడిగండ్ల కూడలి సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో బస చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర ఆదివారం తెలంగాణ లోకి ప్రవేశించింది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగింది. ఆదివారం (23)న దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగిన విషయం తెలిసిందే. మూడురోజుల బ్రేక్‌ తరువాత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి మక్తల్‌ కు చేరుకున్న రాహుల్‌ గాంధీ నేడు అక్కటినుంచే ప్రారంభమైంది. తెలంగాణ రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్‌ నేతల్లో జోష్ మొదలైంది.