Congress seeks CBI probe into Jubilee Hills pub incident
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై సీబీఐ విచారణకు బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్

June 4, 2022

Congress seeks CBI probe into Jubilee Hills pub incident

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో మర్డర్లు, రేపులు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదని, ఘోరానికి పాల్పడిన ప్రముఖుల పిల్లలు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆ పార్టీ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌లపై ప్రభుత్వ నిఘా కొరవడినందున అఘాయిత్యాలు జరుగుతున్నాయని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అసలు మైనర్లను పబ్బులోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.

పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని, కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్‌ కు ఓ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడు, టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనే వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.