యూపీలో కాంగ్రెస్ సూపర్ రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో కాంగ్రెస్ సూపర్ రికార్డు

March 11, 2022

04

ఉత్తరప్రదేశ్‌లో నిన్న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమవగా, అదే రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో మాత్రం అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. అదేంటంటే.. 42 ఏళ్లుగా రాంపూర్‌ఖాస్ అనే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తూ వస్తుంది. 1982 నుంచీ ఇప్పటి వరకు యూపీలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరి హవా నడిచినా కూడా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ను ఎవ్వరూ ఓడించలేకపోయారు. 1982 లో ప్రమోద్ తివారీ అనే వ్యక్తి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2012 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రమోద్ తివారీయే గెలిచారు. ఆ తర్వాత తివారీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రావడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కూతురు ఆరాధనా మిశ్రా బరిలో నిలబడి గెలిచింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆ కుటుంబమే కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచి నియోజకవర్గంలో తమకు తిరుగులేదని నిరూపించింది.