‘మహా’ ప్రభుత్వ ఏర్పాటు.. శివసేనకు కాంగ్రెస్ మద్దతు! - MicTv.in - Telugu News
mictv telugu

‘మహా’ ప్రభుత్వ ఏర్పాటు.. శివసేనకు కాంగ్రెస్ మద్దతు!

November 11, 2019

మహారాష్ట్ర సీఎం పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోడానికి పావులు కదుపుతున్న శివసేన వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ ‘హస్తం’ అదించడానికి సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు బయటి నుంచి మద్దతిస్తామని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సంకేతాలు ఇస్తున్నారు. సేనతో సైద్ధాంతిక విభేదాలు ఉన్న కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ఎన్సీపీ ఇప్పటికే శివసైనికులకు మద్దతు ప్రకటించింది. దీంతో సోనియా గాంధీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ‘మద్దతు’పై చర్చోపచర్చలు చేస్తున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్  ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతోనూ ఆమె ఫోన్‌లో మట్లాడారు. ప్రభుత్వంలో చేరబోమని, అయితే బయటి నుంచి మద్దతిస్తామని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

WhatsApp is Killing...

కాంగ్రెస్ మద్దతు ప్రకటించినా కొన్ని పదవులు, విధాన నిర్ణయాలల్లో షరుతులు విధించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోపక్క.. కాంగ్రెస్ నిర్ణయం రావడంతో శివసేన, ఎన్సీపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 స్థానాలకుగాను బీజేపీకి 105, శివసేనకు 55, ఎన్సీపికి 29, కాంగ్రెస్‌కు, 44 స్థానాలు దక్కాయి. శివసేన మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేని బీజేపీ.. ‘వలసల’పై ఆశ పెట్టుకుంది.