ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ప్రపంచ్ వ్యాప్తంగా క్రేజ్ రెట్టింపు అయ్యింది. అవార్డుకు ముందే ఓ ఊపు ఊసేసిన నాటునాటు సాంగ్.. అస్కార్ అవార్డు దక్కించుకున్నాగా మరింత దూసుకుపోతుంది. పలు ప్రభుత్వాలు, యాడ్ కంపెనీలు నాటునాటు సాంగ్‌ను ప్రచారానికి వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ కూడా బీజేపీని విమర్శించేందుకు ఈ పాటను వాడుకుంది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్ చేస్తున్న ఇమేజ్ స్థానంలో మోదీ అదానీల ఫొటోలను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో పదాలతో మార్చింది. పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ-హిండెన్‌బర్గ్ కేసును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆదాని ఆస్తులు భారీగా పెరగడానికి బీజేపీయే కారణమని గత కొంతకాలంగా బీజేపీ ఆరోపిస్తోంది. మోదీ అండతోనే అదాని తక్కువ టైంలో ఎదిగిపోయాని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హిండెన్‌బర్గ్ అంశంపై కూడా మోదీ, బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి నాటునాటు పాట ఆస్కార్ అందుకున్న సమయంలో మోదీ, అదాని స్నేహితులు అనే అర్థం వచ్చేలా క్రియేట్ చేసింది.