Congress Vs BJP : Women bodybuilders pose in bikini in front of Lord Hanuman
mictv telugu

Congress Vs BJP : ఆంజనేయస్వామి ముందు మహిళల అర్ధనగ్న గంతులు

March 7, 2023

Congress Vs BJP : Women bodybuilders pose in bikini in front of Lord Hanuman

దేవుని విగ్రహం ముందు మహిళలతో అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తారా అంటూ భారతీయ జనతా పార్టీ నేతలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేసి మరీ బీజేపీ నేతలు బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోటీలకు వచ్చిన పోటీదారుల వస్త్రధారణపై పెద్దఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. బికినీలు ధరించి హనుమంతుని ముందు బాడీబిల్డింగ్ ప్రదర్శనలు ఇవ్వడం అసభ్యతను ప్రోత్సహించడమేనని కాంగ్రేస్ శ్రేణులు అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్‏లోని రత్లాంలో బీజేపీ మహిళల బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించింది. అయితే బికినీలు ధరించి మహిళలు తమ బాడీని ప్రదర్శిస్తున్న చోట హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేయడంతో అసలు వివాదం మొదలైంది. ఈ పోటీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. దీంతో హనుమంతుని విగ్రహం అవవిత్రం అయ్యిందని వేదికకు వెళ్లి మరీ ఆంజనేయ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు. అక్కడితో ఆగలేదు, వేదిక దగ్గరే హనునామ్ చాలీసా పఠించారు. ఈ చర్యలకు పాల్పడిన వారికి హనుమంతుడే సరైన బుద్ధి చెబుతాడన్నారు కాంగ్రెస్ నాయకులు.

కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ గట్టిగానే సమాధానం ఇచ్చింది. మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‏కు ఏమాత్రం ఇష్టంలేదని జీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేజ్ బాజ్‏పాయి కౌంటర్ ఇచ్చారు. కుస్తీ, జిమ్నాస్టిక్స్, ఈతల పోటీల్లో పాల్గొనే మహిళలను పాడుకళ్లతో చూస్తున్నందుకు మీకు సిగ్గుండాలన్నారు. దీనికి కౌంటర్‏గా, ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్ సమక్షంలో ఇలాంటి అసభ్యతను ప్రరదర్శించడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత పీయూష్ బాబెల్. భగవంతుడిని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

 

TAGS : hanuman, women body building, congress, bjp, war