Congress will not win in Munugodu: Komati Reddy Venkata Reddy
mictv telugu

గెలవని పార్టీకి ప్రచారం వేస్ట్.. డబ్బులు ఎవరు పెడతారు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

October 22, 2022

Congress will not win in Munugodu: Komati Reddy Venkata Reddy

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పరీక్ష పెట్టనుందా? అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరం కాంగ్రెస్ కొంప ముంచుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోగా, ఆయన సోదరుడు వెంకట రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటూ సోదరుడికి మద్ధతుగా నిలుస్తున్నారు.

తన తమ్ముడికి ఓటు వేయమని, తర్వాత అంతా తాను చూసుకుంటానని వెంకటరెడ్డి చెప్పిన మాటల రికార్డు సంచలనం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయలేనని హాలిడే మీద ఆస్ట్రేలియా వెళ్లిపోయిన వెంకటరెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అక్కడ తన అభిమానులతో మాట్లాడిన వెంకట రెడ్డి.. గెలవని పార్టీకి ప్రచారం చేసినా వేస్ట్ అని, తాను ప్రచారం చేస్తే మహా అయితే ఓ పదివేల ఓట్లు వస్తాయేమోనని వ్యాఖ్యానించారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, తన తమ్ముడు గెలవబోతున్నారని నమ్మకంగా చెప్పారు. అంతేకాక, కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్‌గా చాలా వీక్‌గా ఉందని, తాను ప్రచారం చేస్తే ఖర్చులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. పాతికేళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇక చాలనిపిస్తోందని చెప్పడం కలకలం రేపుతోంది.