ఉత్తమా.. అక్కడేకాదు...అన్నింట్లో అంతే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమా.. అక్కడేకాదు…అన్నింట్లో అంతే..!

June 21, 2017

 తెలంగాణలో గట్టి ప్రతి పక్షం లేదు..కేసీఆర్ ఎదుర్కొనే లీడర్ లేరు. కనీసం ఆయన మాటలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చేటోళ్లు లేరు. ఇది విపక్ష నేతలకు నచ్చకపోయిన అక్షరసత్యం. జనం అనుకుంటున్నదదే.మొన్నటికి మొన్న సీఎం సొంత సర్వేలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పాసయ్యారు. ఇది గులాబీ గంపగుత్తా సర్వే కదా పట్టించుకోనక్కర లేదు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమే స్వయంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. అంటే మిగతా నియోజకవర్గాల్లో బలంగా ఉందా..? పంజాబ్ ఫార్ములా ఇక్కడ పనిచేస్తుందా..?

పీసీసీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల లీడర్ షిప్ శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియా,కిశోర్ చంద్రదేవ్, కొప్పుల రాజు వచ్చారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీనపడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరిగి ఆయా నియోజకవర్గాల్లో బలపడాలని సూచించారు. నిజంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉందని ఉత్తముడు ఒప్పుకోవడం గ్రేట్. కాస్తా వాస్తవానికి దగ్గరగా ఆలోచించారు. అంటే మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉందా.. లేదు లేనే లేదు. అసలు రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించడం లేదు. ఇది అధికారంలో ఉన్నవాళ్లు అంటున్నది కాదు..సొంత పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాటే.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రెండు సర్వేలు చేయించి…జనంలోకి వెళ్లారు. ఇదీ గులాబీ సత్తా అని చాటారు. కాంగ్రెస్సోళ్లు ఈ సర్వేలు బోగస్ బోగస్ అని మైక్ లు పట్టుకుని అరిచారు తప్ప..సొంతంగా ఓ సర్వే చేయిద్దామన్న సోయి లేదు. కేసీఆర్ విసిరిన బాల్ ఆడటమే తప్పా…తాము బాల్ వేయాలని ఎప్పుడు ఆలోచించడం లేదు. సంక్షేమ పథకాలపై గాంధీభవన్ లో కూర్చోని ఆరోపణలు చేస్తున్నారే కానీ.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం లేదు. ఎవరికి వారే మైక్ లేసుకుని లెక్చర్లు దంచుతున్నారు. జనాల్లోకి,జనాల దగ్గరకు మాత్రం వెళ్లడం లేదు. వారు పడుతున్న కష్టాల్ని తెలుసుకునే ప్రయత్నమూ చేయడం లేదు.రైతుల్ని పట్టించుకోవడం లేదు.

రాహుల్ గాంధీ సభ కార్యకర్తలకు బూస్ట్ నిచ్చినా తాత్కాలికమే. ఆయన మాటలు ఆరోజుకి హూషారు నివ్వొచ్చు గానీ ఎల్లకాలం పనిచేయవు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కేడర్ ఉంది. కాకపోతే వీళ్లని సరిగ్గా పట్టించుకునేవాళ్లు లేరు. ఏదో ఓట్ల కోసం తప్ప…మిగతా టైమ్ లో పెద్ద లీడర్లు ఎవరూ వీరి దరి చేరరు.సభలపై ఉన్న యావ ప్రజా సమస్యలపై పోరాటంలో లేదు. ఎంతసేపు ప్రెస్ మీట్లే..పోరు యాత్రలు అసలు లేవు. పంజాబ్ ఫార్ములా.. పంజాబ్ ఫార్ములా అని ప్రతిసారి చెబుతారే కానీ ఎలా అమలు పరుచాలో ఆలోచించారు. పంజాబ్ కు వెళ్లి ఆ ఫార్ములాను ఎలా అమలు చేశారో..ఎలా సక్సెస్ అయిందో పోయి తెలుసుకుని వచ్చారా… అంటే అదీ లేదు.మరి పంజాబ్ ఫార్ములా ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతోంది..?

ఉత్తమా..ఇప్పటికైనా రెండేళ్ల టైమ్ ఉంది. మించి పోయింది ఏమి లేదు..జనాల్లోకి వెళ్తే హస్తం జోర్ దార్..పోరుయాత్రలే పరువు నిలువుతాయి. లేదంటే ఇప్పుడున్న సీట్లు కూడా కష్టమే.ఇలాగే ఉంటే కేసీఆర్ సర్కార్ వచ్చే టర్మే కాదు మరో టర్మ్ కూడా రావొచ్చు..జర భద్రం..