మేఘాలయ సీఎంగా రెండోసారి కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం...హాజరైన ప్రధాని మోదీ..!! - MicTv.in - Telugu News
mictv telugu

మేఘాలయ సీఎంగా రెండోసారి కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం…హాజరైన ప్రధాని మోదీ..!!

March 7, 2023

మేఘాలయ ముఖ్యమంత్రి రెండోసారి ఎన్నికయ్యారు కాన్రాడ్ సంగ్మా. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత సంగ్మా 59స్ధానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేఘాలయతో పాటు నాగాలాండ్‌లో కూడా కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నైఫియు రియో ​​మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు ప్రమాణస్వీకార కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అటు త్రిపురలో మరోసారి లెజిస్లేచర్ పార్టీ నేతగా మాణిక్ సాహా ఎన్నికయ్యారు. మార్చి 8న మాణిక్ సాహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సాయంత్రం మాణిక్ సాహా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు. మేఘాలయ , నాగాలాండ్, త్రిపురలో బీజేపీతో జతకట్టిన పొత్తులు మళ్లీ అధికారంలోకి వచ్చాయి.

.