conspiracy behind shahrukh khan being stopped at mumbai airport
mictv telugu

షారుఖ్ కి బిగ్ షాక్.. తెరపైకి స్మగ్లింగ్ ఆరోపణలు ?

November 13, 2022

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ కి షాక్ ఇచ్చారు ఎయిర్ పోర్ట్ అధికారులు. గత రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ షారుక్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. షార్జాలో ఓ కార్యక్రమానికి హాజరైన తర్వాత కింగ్ ఖాన్ ప్రైవేట్ జెట్‌లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3కి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు షారుక్ ని చెకింగ్స్ పేరుతో 2గంటల పాటు అదుపులోకి తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ మరియు అతనితో ప్రయాణిస్తున్న వారి లగేజీలో చాలా ఖరీదైన గడియారాలు ఉన్నాయన్న సమాచారంతోనే అధికారులు అడ్డగించినట్టు తెలుస్తుంది. దాంతో షారుఖ్ కి 6.83 లక్షల కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి వచ్చింది. 18 లక్షల ఖరీదైన గడియారాలను షారుక్ బ్యాగ్ లో గుర్తించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే షారుఖ్ ని కష్టమ్స్ అధికారులు అడ్డుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2011లోను విదేశీ వస్తువులని తీసుకు వచ్చారని షారుఖ్ ని ముంబై కస్టమ్స్ అడ్డగించింది. ఇక అంతకు ముందు షారుఖ్ ఖాన్ ని అమెరికా ఎయిర్ పోర్టులో సైతం అవమానించారు. ఇక మొన్న షారుఖ్ కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ గమనిస్తున్న షారుఖ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పదే పదే షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తున్నారని అడుగుతున్నారు. కొందరికి షారుఖ్ ఖాన్ సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాడని అంటున్నారు. అయితే కొన్ని బీ టౌన్ మీడియాలో అయితే సంచలన కథనాలు వచ్చాయి. కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించినట్టు.. తండ్రిని స్మగ్లింగ్ కేసులో ఇరికించాలని ప్రయతించినట్టు ఆరోపించారు. వందల కోట్ల ఆస్తిపరుడైన బాలీవుడ్ బాద్షా బ్యాగ్ లో కేవలం 18లక్షల విలువైన వాచీలు ఉండటం వింతనా.. దాన్ని పెద్ద బూతద్దంలో పెట్టి.. అదేదో షారుక్ ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నట్టు బాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఫ్యాన్స్.