Conspiracy to steal EVMs in the Munugode by-election
mictv telugu

మునుగోడు బైపోల్: ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్?

November 4, 2022

Conspiracy to steal EVMs in the Munugode by-election

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఓటింగ్ అనంతరం అభ్యర్థుల భవితవ్యం నిక్షప్తమై ఉన్న ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొందరు కారులో వెంబడించడం కాసేపు కలకలం రేపింది. ఈవీఎంలతో నల్గొండ వెళ్తున్న బస్సును కారులో కొందరు వెంబడించారు. అదేపనిగా తమ బస్సు వెంటే వస్తుండటంతో.. అనుమానించిన పోలీసులు ఆ కారును పట్టుకునేందుకు కిందకు దిగారు.

పోలీసులను చూసిన కారులోని దుండగులు అలర్ట్ అయ్యారు. అందులో ఉన్న మొత్తం ఐదుగురు వ్యక్తులు కారును అక్కడే వదిలి పారిపోయారు. పోలీసులు కారును సీజ్ చేశారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకే వారు కారులో వచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను నల్గొండ తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.