అవతల ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకోకుండా, ‘‘నైట్‌కి వస్తున్నా, డోర్ ఓపెన్ చేసి ఉంచు,’’ అని స్ట్రయిట్‌గా విషయం చెప్పిన ఓ ప్రియుడు అడ్డంగా దొరికిపోయాడు. పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసి తన పరువునూ, ఆమె పరువునూ మంటగలిపాడు. ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం వ్యవహారం ములుగు జిల్లాలో కలకలం రేపింది. మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కుక్కల నాగేందర్, అక్కడే పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
చరమ్మ భర్త మహబూబాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్. భర్త దూరంగా ఉండడమో, మరే కారణమో తెలియదుగాని ఆమె నాగేందర్‌కు దగ్గరైంది. దీనిపై కానిస్టేబుల్ ఇదివరకే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ మీద పంపారు.
అయినా నాగేందర్‌తో సంబంధం మానలేదు. గత శనివారం వేములవాడలో శివరాత్రి సంబంధంగా డ్యూటీ చేసి వచ్చిన కానిస్టేబుల్ భార్యాపిల్లలను చూడ్డానికి మంగపేటకు వచ్చారు. విషయం తెలియని నాగేందర్.. ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేసిందనుకుని ‘‘నైట్ కి నేనొస్తున్నా, డోర్ తీసిపెట్టు,’ అని చెప్పి కట్ చేశారు. అయితే ఫోన్‌ను కానిస్టేబుల్ లిఫ్ట్ చేశాడు. భార్యాప్రియుల ప్రవర్తన మారలేదని, మాంచి గుణపాఠం చెప్పాలని పక్కా పథకం వేశాడు. ముందుగదిలోని బాత్రూంలో దాక్కున్నాడు. నాగేందర్ ఈలవేసుకుంటూ గదిలోకి వెళ్లగానే కానిస్టబుల్ తాళం వేశాడు. దీంతో భార్య, ప్రియుడు గదిలో చిక్కుకుపోయారు. కానిస్టేబుల్ తన బంధువులకు, భార్యకు తెలిసిన టీచర్లకు ఫోన్లు చేసి విషయం చెప్పాడు. తర్వాత గది తెరిచి ఇద్దిరినీ కొట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.