ఏపీ, తెలంగాణలో పోలీసుల నియమాక ప్రక్రియ కొనసాగుతుంది. తెంగాణలో ఈవెంట్స్ ఇటీవల ముగియగా..వాటిలో అర్హత సాధించిన వారికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకూ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏపీలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 7వ తేదిన ముగిసింది. మొత్తం 6511 పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షనిర్వహించనున్నారు. జనవరి 12 నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పోలీసు శాఖలో 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 411 ఎస్ఐ ఉద్యోగాలు కాగా, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో .. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి రెండేళ్లు సడలిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.