మద్యం మత్తులో కానిస్టేబుళ్లు హల్‌చల్.. కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం మత్తులో కానిస్టేబుళ్లు హల్‌చల్.. కేసు నమోదు

April 13, 2022

police

ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం సేవించి, ఆ మత్తులో ప్రవేశం లేకపోయిన, బీసీసీఐ ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించి, ఫొటోలు తీస్తూ.. హల్‌చల్ చేసిన సంఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా విస్తరిస్తున్న కారణంగా టీ20 లీగ్‌లో ఆడే ఆటగాళ్ల కోసం బీసీసీఐ బయోబబుల్‌ను ఏర్పాటు చేసింది.

అయితే, డీవై పాటిల్ స్టేడియంలోని బయోబబుల్‌లోకి నవీ ముంబయి స్టేషన్‌కు చెందిన రవీంద్ర మాతే, థానే పోలీస్ స్టేషన్‌కు చెందిన నరేంద్ర నాగపుర్ అనే సెక్యూరిటీగా డీవై పాటిల్ స్టేడియం వద్ద విధులు నిర్వర్తించారు. అయితే, ఆటగాళ్లు, కామెంటేటర్లు, బ్రాడ్ కాస్టర్లకు మాత్రమే బయోబబుల్ ప్రదేశంలోకి అనుమతి ఇచ్చారు. ఆ ఇద్దరు కానిస్టేబుళు మద్యం సేవించి ఆ మత్తులో వెళ్లి ఫొటోలు తీసేందుకు లోపలికి వెళ్లారు. దీంతో అక్కడున్న కొందరు కానిస్టేబుళ్లపై అగ్రహించి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో వారిపై మహారాష్ట్ర ప్రొబేషన్ యాక్ట్ సెక్షన్ 85(1) కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 182/7 స్కోరు చేయగా, హైదరాబాద్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో 188 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన గుజరాత్‌కు ఝలక్ ఇచ్చింది. దీంతో వరుసగా హైదరాబాద్ రెండో విజయం సాధించి టైటిల్ రేసులో ఉన్నామంటూ చాటిచెప్పింది.