75 గజాలలోపు స్థలంలో నిర్మాణానికి అనుమతులు అవసరంలేదు.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

75 గజాలలోపు స్థలంలో నిర్మాణానికి అనుమతులు అవసరంలేదు.. కేటీఆర్

September 22, 2019

75 గజాలలోపు ఎలాంటి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఆదివారం శాసన మండలిలో కొత్త మున్సిపల్‌చట్టంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ఇంటినిర్మాణ అనుమతులకు సంబంధించి ప్రజలకు కొన్నివెసులుబాట్లు కల్పిస్తున్నట్టు తెలిపారు. 76 నుంచి 600 గజాల స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 21 రోజుల్లోనే ఆన్‌లైన్‌లో అనుమతి ఇస్తామని చెప్పారు. 

KTR

ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నాక ఆరు నెలల్లో కట్టకపోతే ఆ పర్మిషన్‌ రద్దు అవుతుందని ఆయన అన్నారు. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని తెలిపారు. ‘అన్నిపార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్న మందిరాలను తొలగిస్తాం. ప్లాస్టిక్‌ నియంత్రణపై కేంద్రం చట్టం తీసుకొస్తే అమలు చేస్తాం.  అస్తిత్వాన్ని తెలపడం కోసమే కొందరు ఫ్లెక్సీలు కడుతున్నారు. స్వరాష్ట్రంలో ఐటీ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.