గద్వాలలో కలుషిత నీరు.. ఇద్దరి మృతి, 100 మంది ఆస్పత్రిలో - MicTv.in - Telugu News
mictv telugu

గద్వాలలో కలుషిత నీరు.. ఇద్దరి మృతి, 100 మంది ఆస్పత్రిలో

July 7, 2022

మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ సమాజం దాదాపు మర్చిపోయిన కలుషిత నీటి సమస్య బుధవారం గద్వాలలో వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలో వేద నగర్, గంటగేరి, ధరూర్ మెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీలకు కలుషిత మంచి నీరు సరఫరా కావడం వల్ల ఇద్దరు చనిపోయారు. 25 మంది స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, 75 మంది దాకా ప్రైవేటు ఆస్పత్రులలో వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌ఓ చందునాయక్ మాట్లాడుతూ..‘నీటి కాలుష్యం జరిగిన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరికీ వేరే అనారోగ్య సమస్యలుండడంతో ఆరోగ్యం క్షీణించి మరణించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న చాలా కేసులను గుర్తించాం. వారి నుంచి రక్త నమూనాలు, వారు వినియోగించిన నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే మొత్తంగా చూస్తే నీటి కాలుష్యం జరిగిందనేది కాదనలేని సత్యం’ అని వివరించారు.