నకిలీ ధ్రువపత్రాలతో కాంట్రాక్టు లెక్చరర్లు.. బయటపడ్డ బాగోతం - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ ధ్రువపత్రాలతో కాంట్రాక్టు లెక్చరర్లు.. బయటపడ్డ బాగోతం

June 14, 2022

తెలంగాణలో మరో అవినీతి బాగోతం బయటపడింది. కాంట్రాక్టు విధానంలో ఇచ్చిన ఉద్యోగాలలో అర్హత లేని వాళ్లు చేరి అర్హులకు అన్యాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వెరిఫికేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. ఉద్యోగ నియామకాల్లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేయడానికి సిద్ధపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని విభాగాలలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆర్ధిక శాఖ తెప్పించుకుంది. మొత్తం 11000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, అందులో 230 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించారని తేలింది. దీంతో అలాంటి వారందరిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.