2 కేజీల బియ్యమిస్తా అని అత్యాచారయత్నం.. - MicTv.in - Telugu News
mictv telugu

2 కేజీల బియ్యమిస్తా అని అత్యాచారయత్నం..

May 22, 2020

Contractor harassed coolie women

కరోనా వైరస్ వ్యాప్తి కాలంలోనూ కామాంధులు శాంతించడం లేదు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల కష్టాల్లో ఉన్న కూలీ భార్యను ఓ కాంట్రాక్టర్ రెండు కిలోల బియ్యం ఇస్తానని ఆశచూపి రేప్ చేశాడు. ఈ నీచం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో జరిగింది.

ముజ్బిర్ రెహ్మాన్ అనే వ్యక్తి ఈస్ట్ ఫుల్వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనట్ల గ్రామంలో మార్బుల్ వ్యాపారం చేస్తున్నాడు‌. తన వద్ద కూలీగా పని చేస్తున్న వ్యక్తి భార్యను లోగదీసుకోవాలి ఎప్పటినుంచో అనుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆ కూలీ కుటుంబం పడుతున్న ఇబ్బందులను తనకు అనుకూలంగా మలచుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా రెండు కిలోల బియ్యం ఇస్తానని ఆ కూలి భార్యను రమ్మన్నాడు. కష్టకాలంలో యజమాని దేవుడిలా ఆదుకుంటున్నాడని ఆ మహిళా వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది.. అతడు రాక్షసుడని.. అప్పటికే అతడి ఫోన్ లో ఉన్న ఆమె న్యూడ్ వీడియోను చూపించి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. దీంతో ఆమె ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వచ్చింది. అక్కడ జరిగిందంతా తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో యజమానిపై ఫిర్యాదు చేశారు. యజమాని ఫోన్ లో ఉన్న న్యూడ్ వీడియో గతంలో గతంలోనే తీసినట్లు ఉందని పేర్కొంది. లొంగక పొతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.