Home > Featured > జగన్ హామీ ఇచ్చారు నిజమే.. కానీ సాధ్యం కాదు : మంత్రి బొత్స

జగన్ హామీ ఇచ్చారు నిజమే.. కానీ సాధ్యం కాదు : మంత్రి బొత్స

ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై మంత్రి బొత్స బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని అన్నారు. రద్దు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, కేంద్రంతో కూడా ఇబ్బందని తెలిపారు. దీని స్థానంలో ఉద్యోగులకు మరింత ప్రయోజనకరంగా ఉండే మరో స్కీం తెస్తామని వెల్లడించారు. వైసీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన అంశాల్లో దాదాపు 95 శాతం పూర్తి చేశామని, ఇంకా ఐదు శాతం మాత్రమే మిగిలుందనే విషయం ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇప్పటివరకు ఆఫ్ రికార్డు మీటింగులకు ఉద్యోగులు వచ్చారని, ఇప్పుడు ఆన్ రికార్డు మీటింగుకి కూడా వచ్చారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ కోణం నుంచి సమస్యను అర్ధం చేసుకోవాలని సూచించారు.

Updated : 7 Sep 2022 5:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top