ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకుల్లా మాట్లాడ్డం కొత్తేమీ కాదు. కానీ ముంబై సాధ్వి, పొట్టి దుస్తుల రాధేమా శ్రుతి మించి మాట్లడుతున్నారు. డేరా బాబా గుర్మీత్ ను రేప్ కేసులో కోర్టు దోషిగా తేలాక చెలరేగిన అల్లర్లు దైవలీల అని చెప్పుకొచ్చా.. ‘అల్లర్లలో చనిపోయినవాళ్లు వాళ్ల కర్మ కాలి చచ్చారు. ఇదంతా భగవంతుడి లీల…’ అని మెట్ట వేదాంతం పలికారు.
రహీం గురించి తనకేమీ తెలియదని రాధేమా సన్నాయి నొక్కులు నొక్కారు. రాధేమా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్తను ఆమె బలవంతంగా లోబరుచుకుందని ఓ మహిళ గతంలో ఫిర్యాదు చేశారు. ఆమెపై వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది. తన అత్తింటి వారితో కలసి ఆమె తనను కట్నం కోసం వేధించిందని, ఆశ్రయంలోకి తీసుకెళ్లి అనుచరులతో కొట్టించిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కార్లలో తిరుగుతూ, అర్ధనగ్నంగా ఉండే ఆధునిక దుస్తుల్లో కనిపించే రాధేమా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.