మనది అది. భారతదేశం నుంచి తీసుకెళ్ళిపోయి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా దాచేసుకున్న అమూల్యం. వలసపాలనకు గుర్తుగా బ్రిటన్ రాజకుటుంబం చేతిలో ఉన్న అరుదైన వజ్రం కోహినూర్. తరతరాలుగా బ్రిటన్ రాణి కిరీటంలో ఉంటూ వెలిగిపోతున్న ఈ వజ్రాన్ని ఇప్పుడు ప్రదర్శనకు ఉంచుతున్నారు. బకింగ్ హామ్ ప్యాలెస్ లో మే 26 నుంచి ప్రదర్శనలో ఉంటుంది.
ప్రదర్శన:
విక్టోరియా మహారాణి వీలునామా ప్రకారం కోహినూర్ వజ్రాన్ని ఛార్లెస్ భార్య, ప్రస్తుత బ్రిటన్ మహారాణి కెమిల్లా దీన్ని తన కిరీటంలో ధరించాల్సి ఉంది. కానీ ఆమె ఈ కోహినూర్ ప్లేస్లో మరో వజ్రాన్ని ధరిస్తారని బకింగ్ హామ్ ఫ్యాలెస్ ఆల్రెడీ ప్రకటించింది. అందుకే ఇప్పడు కోమినూర్ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. దీన్ని ఇలా ప్రదర్శనలో పెట్టడం ఇదే మొదటిసారి. ఇదొక్కటే కాదు దీనితో పాటూ చాలా విలువైన వస్తువులను బకింగ్ హ్యామ్ ఫ్యాలెస్ వాళ్ళు ప్రదర్శనలో ఉంచుతున్నారు.
మే 6వ తేదీన ఛార్లెస్ -3తో పాటు ఆయన భార్య కెమిల్లాకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. ఎలిజిబెత్ రాణి చనిపోయిన తర్వాత ఛార్లెస్ -3 రాజుగా బాధ్యతలు చేపడుతున్నారు. దీనికి గుర్తుగా లండన్ టవర్ లో మొత్తం రాజాభరణాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. దీంట్లో కోహినూర్ తో పాటూ పెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్, 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్న కలినన్ వజ్రం, ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ లోని బ్లాక్ ప్రిన్స్ రూబీలను కూడా ప్రదర్శిస్తారు. ఈ ఆభరణాలన్ని బ్రిటిష్ రాచరికానికి గొప్ప చిహ్నాలని, వాటికి ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
చరిత్ర:
ఆభరణాలను ప్రదర్శనలో ఉంచడంతో పాటూ వాటి చరిత్ర కూడా తెలిసే విధంలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విలువైన వస్తువుల గొప్ప చరిత్రను సవివరంగా ఆవిష్కరిస్తామని అంటున్నారు. కాంతి శిఖరం అనే అర్ధం కలిగిన కోహినూర్ వజ్రం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చాలామంది ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో మొదటిసారి దొరికిందని చెబుతారు. ఆ తర్వాత చాలా మంది రాజుల చేతులు మారి చివరకు బ్రిటీష్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. దీనిని తిరిగి ఇవ్వాలని భారతప్రభుత్వం ఎన్ని సార్లు అడిగినా బ్రిటన్ తిరస్కరించింది. లండన్ జ్యూయెల్ హూస్లో ఉండే ఈ వజ్రం ఇలా మొదటిసారిగా ప్రజలకు ప్రదర్శనలో ఉంచుతున్నారు. అందుకే దీని గొప్పతనాన్ని, ఎంత మంది రాజులు దీన్ని సొతంత చేసుకున్నారు లాంటి తదితర వివరాలన్నింటినీ వివరిస్తామని హెచ్ఆర్పీ తెలిపింది.