Controversial priest Yati Narsinghanand booked for making indecent remarks against PM Modi
mictv telugu

ప్రధాని మోదీపై వివాదాస్పద కామెంట్స్.. ప్రధాన పూజారిపై కేసు నమోదు

November 9, 2022

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ ఆలయ పూజారిపై యూపీలోని ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాస్నా దేవి మందిరానికి చెందిన ప్రధాన పూజారి, మహంత్ యతి నర్సింహానంద్.. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ వీడియోని పరిగణలోకి తీసుకొని ఆ పూజారిపై తగు చర్యలు తీసుకోబోతున్నట్లు ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజ్ చెప్పారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

కొన్ని రోజుల క్రితం యతి నర్సింహానంద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒకప్పటి రాజు పృథ్వీరాజ్ చౌహాన్ హిందువుల పట్ల ఎలా ప్రవర్తించారో, మోదీజీ కూడా అలాగే చేస్తున్నారు. పృథ్వీరాజ్ చాలా మంది హిందువులను చంపి, మహిళలను కిడ్నాప్ చేశాడు. వాస్తవానికి, అతడు తన సొంత సోదరుడి కూతుర్ని కూడా వదల్లేదు ”అంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే పోలీసులు నర్సింగానంద్ పై ఐపీసీ సెక్షన్ 153 ఎ, 295 ఎ కింద కేసు నమోదు చేశారు.