చిరిగిన జీన్స్‌పై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

చిరిగిన జీన్స్‌పై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

May 16, 2022

చిరిగిన జీన్స్ బట్టలు వేసుకోవడంపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్, బూట్లు వేసుకోవడం భారతీయ సంస్కృతి కాదని పునరుద్ఘాటించారు. అయితే గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉండగా తీరత్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2021 మార్చిలో చిరిగిన జీన్స్, బూట్ల ధరించి ఉన్న ఓ తల్లిని చూసి తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు తర్వాతర్వాత వింత ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లుల వల్ల వారి పిల్లలు కూడా వారిని అనుకరిస్తరాని, పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై పలు విమర్శలు రావడంతో తీరత్ సింగ్ వెనక్కి తగ్గారు. చివరికి క్షమాపణలు చెప్పారు కానీ, అదే సమయంలో తనకు జీన్స్ వేసుకున్న వాళ్లంటే అసహ్యం ఏమీ లేదు కానీ, చిరిగిన బట్టలు వేసుకుంటేనే అభ్యంతకరమన్నారు. అయితే గతంలో తాను చేసన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తాజాగా వెల్లడించారు. కాగా, ఆ తర్వాత నాలుగు నెలలకే తీరత్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామి పదవిలోకి వచ్చారు.