తాజ్‌మహల్ వద్ద శివుడి మంత్రాలు - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్‌మహల్ వద్ద శివుడి మంత్రాలు

October 24, 2017

తాజ్‌మహల్ గొడవ చివరకు ఆ అందాల మందిరానికి చేరువై ముప్పుగా మారింది. తాజ్‌ను చూడ్డానికి వచ్చామనే సాకుతో రాష్ట్రీయ స్వాభిమాన్ దళ్‌, హిందూ యువవాహి సంస్థలకు చెందిన ఇద్దరు యువకులు సోమవారం  అక్కడ ఈశ్వర చాలీసా చదివి హల్‌చల్ చేశారు. పోలీసులు వారిని వారించారు.  ఇది ముస్లింల సంప్రదాయం ప్రకారం నిర్మించిన కట్టడమని, హిందూ పూజలు వగైరా చేయొద్దని నచ్చజెపాపారు. అయితే సదరు భక్తులు వితండ వాదానికి దిగారు. ‘మేం ఈ రోజు సోమవారం పూజలో ఉన్నాం. ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ, మంత్రాలు పఠిస్తున్నాం.

 మమ్మల్ని మధ్యలో లేపుతారా? మీకెంత ధైర్యం. ఇక్కడ పూజలు చేసుకోవద్దా? నమాజులు మాత్రమే చేసుకోవాలా?’ అని అన్నారు. అయితే అక్కడి భద్రతా సిబ్బంది వారిని నిబంధనల ప్రకారం అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లాయి. కేవలలం గొడవ కోసమే వాళ్లు అక్కడికి వచ్చారని విచారణలో తేలింది. అంత మొండిగా వాదించిన ఆ యువకులు తర్వాత దారికొచ్చి రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో వారితని వదిలేశారు.అయితే ఇలాంటి వారిని తాజ్ ఆవరణలోనికి ఎందుకు రానిచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మతచాంధసవాదులకు నుంచి తాజ్ మహల్‌కు ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ యువకులు అక్కడి రావడం ప్రమాదానికి సంకేతమని చెబుతున్నారు.