'కాక్‌టేల్' సినిమా పోస్టర్‌పై వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

‘కాక్‌టేల్’ సినిమా పోస్టర్‌పై వివాదం

February 4, 2020

cocktail

తమిళ హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాక్‌టేల్’ సినిమా పోస్టర్ వివాదం అవుతోంది. విజయ మురుగన్ దర్శకత్వంలో పిజి మీడియా వర్క్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సోమవారం విడుదల చేసిన సినిమా పోస్టర్‌ వివాదాన్ని రగిల్చింది. ‘కాక్‌టేల్’ టైటిల్‌ మద్యానికి సంబంధించిన పదం. అయితే పోస్టర్‌లో తమిళ ప్రజలు ఆరాధించే దైవం మురుగన్‌ వేషధారణలో ఉన్న యోగిబాబు స్టిల్‌ తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘కాక్‌టేల్’ టైటిల్‌గా ఉన్న సినిమాకి ఇలాంటి పోస్టర్‌ విడుదల చేయడం ఏంటని విమర్శిస్తునారు. ఈ విమర్శలపై చిత్రబృందం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎవరి మనోభావాల్ని కించపరిచేలా ఈ సినిమా కథగానీ, పోస్టరుగానీ రూపొందించ లేదని, తాను కూడా మురుగన్‌ భక్తుడినేనని, తన పేరులోనూ మురుగన్‌ ఉందని దర్శకుడు విజయ్‌ మురుగన్‌ వివరణ ఇచ్చారు. సినిమాలో యోగిబాబు కూడా మురుగన్‌ భక్తుడిగానే నటిస్తున్నారని, సినిమా చూశాక అందరూ హర్షిస్తారని లేఖలో పేర్కొన్నారు.