ఓవైపు పెట్రోలు ధరలు పెరిగడంతో జనాలు లబోదిబోమంటుంటే.. మళ్ళీ వంటగ్యాస్ ధరలను పెంచింది కేంద్రం. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89పెంచారు. సబ్సిడీలేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 చొప్పున పెరిగిందని ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల వల్లే ధరలను పెంచినట్టు పేర్కొన్నారు.డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలోనే ఈ వడ్డన అని చెబుతున్నారు. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ వినిపించింది. పెరిగిన గ్యాస్ ధరలతో జనాలు మరింత నిరాసక్తంగా వున్నారు. ప్రజలమీద ప్రభుత్వానికి రోజురోజుకు ప్రేమ చాలా ఎక్కువ అవుతోంది.. వారి ప్రేమను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారంతే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.