వెదర్ కూల్ కూల్ గా..మస్తు మస్తుగా ఉంది. చిటపట చినుకులు రాలుతూ…ఆగుతూ ఉంటే.. ఈ టైంలో ఏం యాదకొస్తవి. ఇంకేంది గరం గరం మిర్చిలే.. చల్లని చినుకుల్లో తింటే ఏంత బాగుండూ అనుకుంటం గదా…
దంచి కొట్టే ఎండల నుండి సెట్టు నీడకోయినట్లుంది పట్నం. వాతావర్నం సల్లగా ఉంది. పట్నం నడ్మ నుంచి మెట్రో బ్రిడ్జి ఉన్నందుకు యాడ మిర్చి బండ్లున్నవో గుర్తు వట్టొస్త లేదు కని…. నాలుగు చిన్కులు ఇట్ల రాలంగనే…. నెత్తి మీద దస్తో… సేతుల సెత్రో వట్టక పోయి నాలుగు మిర్చి బజ్జీలు తినొస్తం. దోస్తులతోటి కల్సి పోతే ఆ మాజానే ఏరేగ ఉంటది.
ఓ పదేండ్ల కింద అయితే ఓ మోస్తారు ఊర్ల గూడ మిర్చి బజ్జీల బండ్లకు వానా కాలంల మస్తు గిరాకీ… చిన్కులు వడ్డప్పుడైతే జరకంత ఎక్వనే ఉంటది. మిర్చిలు దిన్నాంక ఓ కోపెడు గరం గరం చాయి గిట్ల తాగితే అబ్బో ఆనందం సెప్పతరం గాదు… కదా.. ఇంకెందకు ఆలస్యం పద బజ్జీల బండి దగ్గరకు….