సికింద్రాబాద్‌లో కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ బోల్తా పడింది. దీంతో స్థానికులు కూల్ డ్రింక్స్ కోసం ఎగబడ్డారు. దొరికినవి దొరికినట్టు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి బోయినపల్లి నుంచి తాడ్‌బండ్ వెళ్తున్న కూల్ డ్రింక్స్ కంటైనర్ తాడ్‌బండ్ మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
దీంతో అందులో ఉన్న కూల్ డ్రింక్స్ నేల పాలయ్యాయి. అనంతరం పోలీసులు కంటైనర్ తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయలయ్యాయి.