లంకెబిందె దొరికింది.. తలబాదుకున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

లంకెబిందె దొరికింది.. తలబాదుకున్న జనం

September 11, 2019

Copper coins treasure.

అదృష్టలక్ష్మి తలుపు తడితే దరిద్రదేవత అడ్డుపడింది. శతాబ్దాల నాటి కోనేట్లో పూడిక తీస్తుండగా పెద్ద లంకెబిందె బయటపడగా, అందులో ఏమున్నాయో చూసి జనం అంతా భ్రాంతియేనా అని తలబాదుకున్నారు. తమిళనాడులోని ఆరియూర్ జిల్లా ఆండి మఠానికి చెందిన కోనేట్లో ఇటీవల పూడిక తీశారు. పూడిక మధ్య ఒక మట్టికుండ కనిపించింది. జేసీబీ దెబ్బకు అది పగిలి పోయి చుట్టుపక్కల చిల్లర పడిపోయింది. అవి బంగారు నాణేలు అనుకుని జనం చుట్టూ మూగారు. కొందరు రాయితో గోకి చూడగా మొత్తం నాణేలన్నీ రాగివని తేలిసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ నాణేలు క్రీస్తు శకం 9వ శతాబ్ది నుంచి 13వ శతాబ్ది మధ్య పాలించిన చోళుల కాలావని పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మొత్తం 200 నాణేలు లభించాయని, వీటిని మ్యూజియానికి తరలిస్తామని అధికారులు చెప్పారు.