శ్రీశైలంలో భారీగా వెండినాణేలు, రాగి శాసనాలు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలంలో భారీగా వెండినాణేలు, రాగి శాసనాలు

September 16, 2020

Copper inscriptions in Srisailam temple Ghantamatum

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల చరిత్ర ఆనవాళ్లకు నెలవుగా మారింది. వారం కిందట అక్కడ ఘంఠామఠంలో 28 రాగి శాసనాలు లభించగా, తాజాగా మంగళవారం మరో రెండు శాసనాలు దొరికాయి. వాటితోపాటు ఏకంగా 245 వెండి నాణేలు కూడా లభించాయి. ఇవి కూడా ఘంటామఠం వద్దే దొరకడం గమనార్హం. 

ఘంటామఠంలోని చిన్న శివాలయ పునరుద్ధరణ పనుల్లో ఇవి ఓ గోడలోంచి బయటపడ్డాయి. శాసనాలపై దేవనాగరి, కన్నడ లిపి ఉండగా,  శివలింగానికి ఓ రాజు నమస్కరిస్తు చిత్రాలు, నంది, గోవు చిత్రాలు కూడా ఉన్నాయి. నాణేలు 1800-1900 మధ్య కాలానివి అని, శాసనాలను చదవాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఇటీవల దొరికిన రాగి శాసనాలు ఒడిశా రాజులు, కొండవీటి రాజులు దేవుడికి మడిమాన్యాలు ఇచ్చినప్పుడు రాయించినవని పరిశోధకులు తేల్చారు. ఘంటామఠంలో శాసనాలు పెద్దసంఖ్యలో లభిస్తుండడంతో పూర్వం ఆ మఠానికి రాజులు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారని తెలుస్తోంది.