Copper is the king of grains
mictv telugu

 సిరిధాన్యాలలో రారాజు రాగి

November 11, 2022

మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాల‌ను అందించే సిరి ధాన్యాల‌లో రాగులు కూడా చాలా ముఖ్యమైన‌వి. వీటితో చాలా మంది చాలా ర‌కాల ప‌దార్థాల‌ను చేసుకుని తింటుంటారు. ఎలా తిన్నా కూడా రాగి మన ఒంటికి చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. రోజూ డైట్ లో వీటిని చేర్చుకోండి అని సూచిస్తున్నారు. మరి రాగి వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.

రాగుల‌తో జావ చేసుకుని తాగితే ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడతాయి.రాగుల్లో అమినోయాసిడ్స్ ఉంటాయి. ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గిస్తుంది. అలాగే బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అదనపు క్యాలరీలను తీసుకోకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మనం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోము.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్ధకమయిన ధాన్యం. దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, వయస్సు తక్కువగా కనబడేలా చేస్తుంది.రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. స్థూలకాయం రాకుండా ఉంటుంది.

ఇవే కాదండీ రాగి తినడం వల్ల అన్ని వయసుల వాళ్ళకీ బెనిఫిట్స్ ఉంటాయంట. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి సుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడానికి , గుండె జబ్బులు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంటాయట. రాగి ఎలాంటి వారికి అయినా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి వీటిని తప్పనిసరిగా తినండి అని చెబుతున్నారు న్యూటీషన్లు.