మిలియన్ మార్చ్ ఎఫెక్ట్.. ట్యాంక్ బండ్ వద్ద ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

మిలియన్ మార్చ్ ఎఫెక్ట్.. ట్యాంక్ బండ్ వద్ద ఆంక్షలు

November 9, 2019

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో జేఏసీ ఛలో ట్యాంక్ బండ్‌కు పిలుపునిచ్చింది. ఇటు సర్కార్ అటు జేఏసీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. రోజు రోజుకు ఆర్టీసీ జేఏసీ తన నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తూనే ఉంది. దీంతో శనివారం కార్మికులంతా ఐక్యంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. 

Million March.

అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జేఏసీ కో కన్వీర్‌ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాజాసింగ్‌ను, పొన్నాల లక్ష్మయ్యను హౌస్‌ అరెస్ట్ చేశారు. దీంతో.. అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి, జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా.. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 155 మంది కార్మికుల అరెస్ట్ చేసిన పోలీసులు. వారిని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. అయితే ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. బెదిరింపులకు కార్మికులు ఎవరూ భయపడరని ఆయన స్పష్టం చేశారు.