ప్రపంచంలోనే ఎత్తైన పగడపు దిబ్బ.. 120 ఏళ్ల  క్రితమే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే ఎత్తైన పగడపు దిబ్బ.. 120 ఏళ్ల  క్రితమే..

October 28, 2020

Coral Reef Taller Than Eiffel Tower.jp

సముద్ర గర్భంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని విశేషాలు ఉన్నాయి. ఎన్నో శోధనల తర్వాత వాటి గురించి తెలిసి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా అలాంటి ఓ వింత బయటపడింది.ప్రపంచంలోనే అతి ఎత్తైన పగడపు దిబ్బను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 120 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన దీన్ని చాలా కష్టపడి చేధించారు. సముద్ర గర్భంలో ఉన్నఈ దిబ్బను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇది ఎంపైర్ స్టేట్ భవనం, ఈఫిల్ టవర్‌, పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుందని వారు తెలిపారు. గ్రేట్ బారియర్ రీఫ్‌లో ఇది బయటపడింది. ఇంత వరకు ఇంత కంటే ఎత్తైన దిబ్బ లేదని వెల్లడించారు. 

f

ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా నిలిచిన ఎంపైర్ స్టేట్ భవనం పొడవు 381 మీటర్లు ఉంటుంది. కానీ కొత్తగా కనుగొన్న పగడపు దిబ్బ ఎత్తు 500 మీటర్లు.నార్త్ క్వీన్స్‌లాండ్‌ వెలుపల ఉన్న నీటిలో 120 సంవత్సరాలకు ముందు దీని గురించి తేలిందని పేర్కొన్నారు.  1.5 కిలోమీటర్ల వెడల్పుతో.. 500 మీటర్ల ఎత్తుతో దిబ్బ ఉన్నట్లు గుర్తించారు. అయితే దాన్ని అన్వేషించేందుకు ష్మిత్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ప్రత్యేక నౌకలో ప్రయాణించారు. ఎనిమిది రోజుల క్రితం ఈ దిబ్బను కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. 

ఈ దిబ్బను చేరుకోవడానికి ఎంతో శ్రమించారు. సుబాస్టియన్ అనే రోబోట్‌ తయారు చేసి దాన్ని లోపలికి పంపించారు. అది లోపల అన్వేషణ జరిపి వీడియో ఫుటేజీని తీసింది. దీంట్లో మొత్తం

ఏడు ఇతర పొడవైన దిబ్బలు ఉన్నాయని, వీటిలో ఆకుపచ్చ తాబేళ్లు నివసించే రైన్ ఐలాండ్ దిబ్బలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఈ ఆవిష్కరణను చూసి ఆశ్చర్యపోతున్నారు. 3డీ ఎఫెక్ట్‌లో దిబ్బను వివరంగా చూపించడంలో సుబాస్టియన్‌ రోబో, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారని పలువురు ప్రశంసిస్తున్నారు.