మొక్కజొన్నతో  లెక్కలేనన్ని లాభాలు.. ఎలాగంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

మొక్కజొన్నతో  లెక్కలేనన్ని లాభాలు.. ఎలాగంటే..!

November 25, 2019

Corn flakes health benefits

చలికాలంలో మొక్కజొన్న కండెలను కాల్చుకుని తింటే ఆ రుచే వేరు. మొక్క జొన్నను కాల్చుకునే కాకుండా రకరకాలుగానూ తినొచ్చు. ఉడకపెట్టుకోవచ్చు, లేదా గింజలను వలిచి వాటితో వడలు, పనకోడీలు వంటి నానా  వెరైటీలు చేసుకొని తినచ్చు. ఎలా తిన్నా దానితో పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు.

* మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. మలబద్దకం, మొలలు వంటి వ్యాధులను నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్‌ను అరికడుతుంది. 

* మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్ ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతాయి. 

* మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఈ విత్తనాలతో చేసిన నూనెను చర్మానికి రాస్తే దద్దుర్లు రావు. 

* గర్భవతులకు ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్ కాళ్లు, చేతులు వాపురాకుండా నియంత్రిస్తుంది. కడుపులోని శిశువు మంచి బరువును కలిగి ఉండేలా చేస్తుంది.

* మొక్కజొన్న గింజలను నీటిలో ఉడకబెట్టి, వడకట్టి తేనె లేదా కలకండను కలుపుకుని తాగాలి. మూత్రపిండ వ్యాధితో బాధపడేవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. 

* రక్తహీనతను అరికట్టడంలో మొక్కజొన్న అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

* మొక్కజొన్నలోని కెరొటినాయిడ్లు, బయోప్లవనాయిడ్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. కండరాల క్షీణతను దూరం చేస్తాయి.

* మొక్కజొన్నలోని పిండిపదార్థాలు శరీరానికి  శక్తిని అందిస్తాయి. చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీనిద్వారా అందే ఫైటోకెమికల్స్‌ రక్తంలో చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచుతాయి.

* నిప్పుమీద కాల్చిన మొక్కజొన్నను తింటే దంతాలు దృఢంగా తయారవుతాయి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం కారణంగా మలబద్దకం దూరమవుతుందంటున్నారు వైద్యులు.