కేసీఆర్ ఆఫీసులో కరోనా.. ఎవరూ రావొద్దు..  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఆఫీసులో కరోనా.. ఎవరూ రావొద్దు.. 

June 6, 2020

Corona at the KCR office.. Nobody comes

ఓవైపు ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా సోకగా.. ఇప్పుడు తెలంగాణా సీఎం కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మెట్రో రైల్‌ భవన్‌లో పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగికి పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ వ్యాపించిందని గుర్తించారు. దీంతో సీఎంవో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆఫీసుకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో సీఎంవోలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు సీఎంవో మొత్తం సిబ్బంది శానిటైజేషన్ చేస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు సీఎంవో కార్యాలయం మూసివేయనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేకరించింది. కాగా,  అక్కడ పనిచేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు.