Corona blow on parties.. Huge reduction in donations
mictv telugu

పార్టీలపై కరోనా దెబ్బ.. భారీగా తగ్గిన విరాళాలు

July 14, 2022

కరోనా సామాన్యుల జీవితాలపైనే కాదు రాజకీయ పార్టీలపై కూడా ప్రభావం చూపింది. కరోనా ముందు, తర్వాత చూస్తే ఆయా పార్టీలకు వచ్చే విరాళాలలో రూ. 420 కోట్ల మేర భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. బీజేపీకి 2019-20 ఆర్దిక సంవత్సరంలో రూ. 785 కోట్లు రాగా, 2020-21 వచ్చేసరికి అది 39.23 శాతం తగ్గి రూ. 477.54 కోట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ కూడా రూ. 139.01 కోట్ల నుంచి రూ. 74.52 కోట్లకు తగ్గింది. మొత్తం అన్ని పార్టీల విరాళాల్లో ఢిల్లీ రూ. 246 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాత వరుసగా మహారాష్ట్ర రూ. 71.68 కోట్లు, గుజరాత్ రూ. 47 కోట్లు ఉన్నాయి. అన్ని జాతీయ పార్టీలకు దాదాపు 80 శాతం అంటే రూ. 480.65 కోట్లు కేవలం కార్పొరేట్, బిజినెస్ రంగాల వారు ఇచ్చినవి. మిగతా సొమ్మును 2258 వ్యక్తులు ఇచ్చినవని నివేదిక వెల్లడించింది.