నిజామాబాద్‌లో నిర్వాకం.. కరోనా డెడ్‌బాడీలు తారుమారు  - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో నిర్వాకం.. కరోనా డెడ్‌బాడీలు తారుమారు 

September 26, 2020

Corona Body Changes in Nizamabad

కరోనా పేషంట్ల విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. ప్రైవేటు ఆస్పత్రులు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. చనిపోయిన రోగుల పట్ల అత్యంత హేయంగా వ్యవహరిస్తున్నారు. ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ రోగులపై చూపించడం లేదు. దీని కారణంగా ఒకరి శవానికి బదులు మరో శవాన్ని ఇచ్చిన ఘటన వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కరోనా శవం విషయంలో ఇదే జరిగింది. దీంతో అతడి బంధువులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల చేరాడు. పరిస్థితి విషమించి అతడు చనిపోయాడు. ఈ విషయాన్ని అతని బంధువులకు చేరవేయడంతో స్వ గ్రామానికి తీసుకొచ్చారు. తీరా అంత్యక్రియలు జరిగే సమయంలో మృతదేహం మారిపోయిందని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. వెంటనే అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. అతడు విషయం చెప్పడంతో అంత్యక్రియలు నిలిపివేశారు.  హనుమంతు మృతదేహాన్ని అప్పగించిన తర్వాతే దాన్ని తీసుకెళ్లాలని అతడి బంధువులు స్పష్టం చేశారు.