భారత్‌లో కరోనా విజృంభణ..కొత్తగా 17,336 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా విజృంభణ..కొత్తగా 17,336 కేసులు

June 24, 2022

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 17,336 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో మొదటి స్థానంలో ముంబై ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కొత్త కేసులకు సంబంధించిన బులిటెన్‌ను నేడు విడుదల చేశారు.

బులెటెన్ ప్రకారం..” గడిచిన 24 గంటల్లో 17, 336 కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.”

ఇక, రాష్ట్రాల వారీగా చూస్తే, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5,218 కేసులు, కేరళలో 3,890 కేసులు, ఢిల్లీలో 1,934, తమిళనాడులో 1,063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు