కరోనా విజృంభణ.. 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా విజృంభణ.. 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు

April 25, 2022


దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మొదలైంది.12 రాష్ట్రాల్లో వారం రోజుల్లో కొత్త కేసులు క్రమంగా పెరిగాయి.  ఆ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురౌవుతున్నారు. ప్రతిరోజూ 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన వారంతో పోలిస్తే, 12 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త కేసుల వివరాలను వెల్లడించింది. ”గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.02 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించాం. అందులో 2,541 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 1,862 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 30 మంది మృతి చెందారు. తాజా మృతులతో కలిపి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,22,223కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 187 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశాం” అని ఆరోగ్య శాఖ తెలిపింది.