భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ 16వేలకుపైగా నమోదైన్న కొత్త కేసులు బుధవారం ఒక్కరోజే 18,930 కొత్త కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
”దేశంలో కరోనా కొత్త కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు” అని కరోనా బులెటెన్‌లో పేర్కొన్నారు.
ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు విషయానికొస్తే.. 4.32 శాతానికి చేరిందని, మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 198.33 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వివరాలను వెల్లడించారు.