కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 53,601 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 53,601 కేసులు

August 11, 2020

Corona Cases in India August 11th

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఏడవ రోజు కూడా అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చాయి. అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన  24 గంటల్లో దేశంలో 53,601 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 871 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ 4,77,023 శాంపిళ్లను పరీక్షించారు. 

దేశవ్యాప్తంగా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 22,68,676కు చేరగా.. మరణాల సంఖ్య మొత్తం 45,257 కు చేరింది. 15,83,490  మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 6,39,929 మంది ఆయా రాష్ట్రల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్ బారిన పడుతున్నవారిలో 69.80 శాతం మంది తిరిగి కోలుకుంటున్నారు. మరణాల సంఖ్య 1.99 శాతం వరకు మాత్రమే ఉండటం ఊరట కలిగించే విషయం.