భారత్‌లో కరోనా అప్‌డేట్ : ఒక్కరోజే 1007 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా అప్‌డేట్ : ఒక్కరోజే 1007 మంది మృతి

August 14, 2020

Corona Cases in India August 14th

భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 25 లక్షలకు చేరువైంది. ప్రతి రోజూ 60 వేలకు పైగా కొత్తగా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో 64,553 మందికి కరోనా సోకిందని, 1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 55,573 మంది డిశ్చార్జి అయ్యారు. 8,48,728 శాంపిళ్లను పరీక్షించారు. 

     దేశ్యవాప్తంగా ఇప్పటి వరకు 24,61,191 మంది వ్యాధి బారిన పడ్డారు. మరణాల సంఖ్య మొత్తం 48,040కు పెరిగింది. 17,51,556 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 6,61,595 మంది ఇంకా వివిధ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం  2,76,94,416 మందికి టెస్టులు చేసినట్టు తెలిపారు. పాజిటివ్‌ కేసులతోపాటు డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో అంతా కాస్త ఊరట చెందుతున్నారు. 

మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అక్కడ1,70,415 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రెజిల్ 1,05,564, మెక్సికో 55,293, భారత్‌లో 47,033 మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,91,079కు చేరింది. వీరిలో 64,19,775 యాక్టివ్ కేసులు ఉండగా, 1,39,17,825 మంది  కోలుకున్నారు.