25 లక్షలు దాటిన కరోనా కేసులు.. 49,036 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

25 లక్షలు దాటిన కరోనా కేసులు.. 49,036 మరణాలు 

August 15, 2020

Corona Cases in India August 15

భార‌త్ లో క‌రోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గ‌డం లేదు. వ‌రుసగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 మందికి క‌రోనా ల‌క్ష‌ణాల‌ను గుర్తించారు. 996 మంది మరణించారు.  నిన్న ఒకేరోజు 8,68,679 మందికి కరోనా పరీక్షలు చేశామని కేంద్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.. గడచిన 24 గంటల్లో 8,68,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,26,193 మందికి మహమ్మారి అంటుకుంది.  49,036 మరణించారు.  18,08,937 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా  6,68,220 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 14 నాటికి దేశవ్యాప్తంగా 2,85,63,095 నమూనాలను పరీక్షలు నిర్వహించారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 26.88 శాతంగా ఉన్నాయి. రోగుల రికరీ రేటు కూడా 71.77 శాతానికి పెరిగింది. కేసులు పెరుగుతున్నా కూడా రికవరీ సంఖ్య కూడా పెరుగుతుండటంతో కొంత ఆందోళన తగ్గింది.