భారత్‌లో కరోనా కల్లోలం..17 లక్షలు దాటిన కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా కల్లోలం..17 లక్షలు దాటిన కేసులు

August 2, 2020

Corona Cases in India August 2nd .

కరోనా మహమ్మారి విజృంభనతో దేశంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన నాలుగు రోజులుగా యాబై వేలకు పైగా మంది వ్యాధిబారిన పడుతున్నారు. తాజాగా 24 గంటల్లో నమోదైన కేసులు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 

 నిన్న ఒక్కరోజే భారత్‌లో 54,736 మందికి కొత్తగా కరోనా లక్షణాలు గుర్తించారు. 853 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,63,172 మంది శాంపిళ్లను పరీక్షించగా.. ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. 

దీంతో ఇప్పటివరకు మొత్తం 17,50,724 మంది మహమ్మారిబారిన పడ్డారు. వీరిలో 37,364 మంది వైరస్ కాటుకు బలి అయ్యారు. 11,45,630 మంది కోలుకోగా 5,67,730 మంది ఇంకా ఆయా రాష్ట్రల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,98,21,831 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 18,023,614 మందికి వ్యాధి సోకింది. వీరిలో 6,88,941 మృత్యువాత పడ్డారు. 11,332,014 మంది వైరస్‌ను జయించి ఇంటికి చేరారు.