కరోనా భారతం.. 7,67,296 కేసులు 21,129 మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భారతం.. 7,67,296 కేసులు 21,129 మరణాలు 

July 9, 2020

Corona Cases in India July 9th

కరోనా మహమ్మారి భారత్‌లో కట్టడి కావడం లేదు. దీని తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 24,879 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 487 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరగా.. మరణాలు 21,129కు పెరిగాయి. 4,76,378 మంది వైరస్‌ను జయించి ఇంటికి వెళ్లిపోయారు. ఇంకా  2,69,789 మందికి చికిత్స కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో మొత్తం 2,67,061 శాంపిళ్లను పరీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 12,164,119 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 5,52,023 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5.5 మిలియన్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.