భారత్‌లో పెరుగుతున్న రికవరీలు, పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో పెరుగుతున్న రికవరీలు, పాజిటివ్ కేసులు

October 1, 2020

Corona Cases in India October 1

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు రికవరీలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఇటీవలే అన్ని సముదాయాలు తెరుచుకోవడంతో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. గడిచిన  24 గంటల్లో 86,821 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 1181 మంది మృత్యువాతపడ్డారు. 14,23,052 మంది శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. నిన్న 85,376 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

దేశంలో ఇప్పటి వరకు 7,56,19,781 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంట్లో 63,12,585 మందికి వైరస్ సోకింది. 52,73,201 మంది కోలుకున్నారు. 98,678 మంది చనిపోయారు.  9,40,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 83.53 శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 34,159,232 మందికి వ్యాధి సోకింది.1,018,792 మంది బాధితులు చనిపోయారు. 25,430,552 మంది కోలుకోగా.. ఇంకా 7,709,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి.