భారత్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. 10,73,014 శాంపిళ్లను పరీక్షించగా.. 55,342 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. అదే సమయంలో 706 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. 77,760 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 86 శాతానికి పెరిగింది.
దేశవ్యాప్తంగా 71,75,881 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 1,09,856 మంది ప్రాణాలు కోల్పోయారు. 62,27,296 మంది కోలుకున్నారు. 8,38,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 8,89,45,107 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మరణాల రేటు 1.53శాతంగా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 38,042,467 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,085,373 మరణాలు సంభవించాయి. 28,602,858 మంది కోలుకోగా.. ఇంకా 8,354,236 యాక్టివ్ కేసులు ఉన్నాయి.