భారత్‌లో కొత్తగా 67,735 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కొత్తగా 67,735 కరోనా కేసులు

October 15, 2020

bbhmgchn

భారత్‌తో కరోనా కేసుల సంఖ్య 73 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 67,708 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది.  680 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.  11,36,183 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. 81,541 డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 87.36 శాతానికి పెరిగింది. 

దేశ్యవాప్తంగా 73,07,098 మందికి వ్యాధి సోకింది. మృతుల సంఖ్య 1,11,266కు చేరింది. 63,83,442 మంది కోలుకున్నారు. 8,12,390 మంది ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. 9,12,26,305 కరోనా పరీక్షలు చేశారు. యాక్టివ్ కేసుల శాతం 11.12 శాతంగా ఉంది. మరోవైపు 38,752,973 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. 1,096,962 మంది బాధితులు చనిపోయారు.  29,129,637 డిశ్చార్జీలు అయ్యాయి. ఇంకా 8,526,374 యాక్టివ్ కేసులు ఉన్నాయి.